04 Aug
|
Kalam Daily
|
Lakhtar
04 Aug
Kalam Daily
Lakhtar
Sunday, August 2, 2026
Homeలైఫ్ స్టైల్కెరీర్
ఒక్క రూపాయి ఖర్చు లేకుండా సివిల్స్ కోచింగ్!
By Kalam Desk
14 July 2026, 4:15 pm
కలం, వెబ్ డెస్క్: యూపీఎస్సీ సివిల్స్ (Civils Coaching) పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న తెలంగాణ బీసీ అభ్యర్థులకు భారీ శుభవార్త. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా కోచింగ్ ఇవ్వబోతున్నట్లు బీసీ ఉపాధి, శిక్షణాభివృద్ధి కేంద్రం ప్రకటించింది. 2027లో జరిగే సివిల్స్ ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలకు కలిపి ఆగస్టు 24వ తేదీ నుంచి 2027 మే వరకు కోచింగ్ ఇవ్వబోతున్నారు.
మరిన్ని కనుగొనండి
ఆన్‌లైన్ వార్తలు
Geographic Reference
వార్తాపత్రిక చందా
150 మందికే అవకాశం..
150 మందికి మాత్రమే కోచింగ్ అవకాశం కల్పిస్తారు. వీరిలో 50 మందిని ఇప్పటికే ప్రిలిమ్స్ క్లియర్ చేసి మెయిన్స్ కోసం సన్నద్ధమయ్యేవారిని తీసుకుంటారు. వీరికి ఎలాంటి స్క్రీనింగ్ టెస్ట్ ఉండదు. ప్రిలిమ్స్ క్వాలిఫై కార్డుతో సంప్రదిస్తే చాలు.. నేరుగా ప్రవేశం పొందవచ్చు. మిగిలిన వంద సీట్ల కోసం స్క్రీనింగ్ టెస్ట్ పెడుతారు. దీనిలో అర్హత సాధించిన వారికే కోచింగ్ ఇస్తారు.
ప్రతి నెలా రూ.5 వేల స్టైఫండ్..
అభ్యర్థికి ప్రతి నెలా రూ.5 వేలు స్టైఫండ్ కింద అందిస్తారు. బుక్స్ కొనుగోలు చేసుకునేందుకు ఒకేసారి అదనంగా రూ.5 వేలు అందిస్తారు. ఈ స్టడీ సర్కిల్‌లో అత్యంత అనుభవం ఉన్న ఫ్యాకల్టీతో సబ్జెక్టుల వారీగా కోచింగ్ ఇవ్వనున్నారు. ప్రతి వారం మాక్ టెస్టులతో పాటు వాటిని మూల్యాంకనం చేసి అభ్యర్థికి ఎప్పటికప్పుడు ఫీడ్ బ్యాక్ ఇస్తారు.
వీరు మాత్రమే అర్హులు..
యూపీఎస్సీ జారీ చేసిన నోటిఫికేషన్ అర్హతలు పూర్తిగా కలిగి ఉండాలి. కచ్చితంగా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. తల్లిదండ్రుల ఆదాయం గ్రామీణ ప్రాంతాల వారైతే ఏడాదికి రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల వారైతే రూ.2 లక్షల ఆదాయం మాత్రమే ఉండాలి. అభ్యర్థులు ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఉండొద్దు. అలాగే, ఇతర కోర్సులు కూడా చదువుతూ ఉండొద్దు. పూర్తిగా సివిల్స్ పరీక్షల కోసమే ప్రిపేర్ అవుతుండాలి. ఇంతకుముందు, ప్రభుత్వం నిర్వహించిన కోచింగ్ కూడా తీసుకుని ఉండొద్దు.
ఇవే ముఖ్యమైన తేదీలు..
సివిల్స్ కోచింగ్ కోసం రేపు (జులై 15) నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నారు. జులై 17వ తేదీ నుంచి ఆగస్ట్ 7వ తేదీ వరకు తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ వెబ్ సైట్ ద్వారా ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరిస్తారు. ఆగస్ట్ 13 నుంచి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆగస్ట్ 16న స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించి, 19న ఫలితాలను ప్రకటిస్తారు. ఆగస్ట్ 21న సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేసి, 24వ తేదీ నుంచి హైదరాబాద్ సైదాబాద్‌లోని లక్ష్మినగర్ కాలనీలో ఉన్న బీసీ స్టడీ సర్కిల్‌లో సివిల్స్ కోచింగ్ ప్రారంభిస్తారు. పూర్తి వివరాల కోసం 040-24071178, (phone hidden) నెంబర్లను సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు.
- Tags
- BC Study Circle
- Civils Coaching
- Telangana Aspirants
- UPSC
Facebook X
WhatsApp
Copy URL
మరిన్ని వార్తల కోసం మా వాట్సప్ ఛానల్ ఫాలో అవ్వండి
Previous article
దస్తురాబాద్, పెంబి KGBVలను తనిఖీ చేసిన కలెక్టర్ భవేశ్ మిశ్రా
Next article
కలెక్టర్‌కు చెప్పినా మా ఇష్టమే..! విద్యార్థులపై ఆర్టీసీ డ్రైవర్ రుబాబ్
లేటెస్ట్ న్యూస్
పెరూలో ఘోర విమాన ప్రమాదం
ఇంద్రకీలాద్రిలో గుడి ముందే రీల్స్.. పట్టించుకోని అధికారులు
రికార్డు స్థాయిలో టీటీడీ ఆదాయం.. ఎన్ని కోట్లంటే?
బోనాల జాతరకు భారీ భద్రత: సీపీ సజ్జనార్
గ్లాస్గోలో భారత్ పతకాల జోరు: ఒకే రోజు ఏడు స్వర్ణాలు!
Read More Latest News >>
ఎక్స్‌క్లూజివ్
కార్పొరేషన్ల భర్తీకి కసరత్తు.. రేసులో గెలిచేదెవరు?
పింఛన్ లబ్ధిదారులు @ 50 లక్షలు!
నారాయణఖేడ్ ఫామ్ ల్యాండ్స్ మాయాజాలం!
‘కావేరి’ చిచ్చు.. తమిళనాడు, కర్నాటకలో వివాదం తీవ్రరూపం
అర్బన్ ఇందిరమ్మ ఇండ్లకు బూస్టప్
Read More Exclusive Stories >>
Homeలైఫ్ స్టైల్కెరీర్
ఒక్క రూపాయి ఖర్చు లేకుండా సివిల్స్ కోచింగ్!
By Kalam Desk
14 July 2026, 4:15 pm
కలం, వెబ్ డెస్క్: యూపీఎస్సీ సివిల్స్ (Civils Coaching) పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న తెలంగాణ బీసీ అభ్యర్థులకు భారీ శుభవార్త. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా కోచింగ్ ఇవ్వబోతున్నట్లు బీసీ ఉపాధి, శిక్షణాభివృద్ధి కేంద్రం ప్రకటించింది. 2027లో జరిగే సివిల్స్ ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలకు కలిపి ఆగస్టు 24వ తేదీ నుంచి 2027 మే వరకు కోచింగ్ ఇవ్వబోతున్నారు.
మరిన్ని కనుగొనండి
ఆన్‌లైన్ వార్తలు
Geographic Reference
వార్తాపత్రిక చందా
150 మందికే అవకాశం..
150 మందికి మాత్రమే కోచింగ్ అవకాశం కల్పిస్తారు. వీరిలో 50 మందిని ఇప్పటికే ప్రిలిమ్స్ క్లియర్ చేసి మెయిన్స్ కోసం సన్నద్ధమయ్యేవారిని తీసుకుంటారు. వీరికి ఎలాంటి స్క్రీనింగ్ టెస్ట్ ఉండదు. ప్రిలిమ్స్ క్వాలిఫై కార్డుతో సంప్రదిస్తే చాలు.. నేరుగా ప్రవేశం పొందవచ్చు. మిగిలిన వంద సీట్ల కోసం స్క్రీనింగ్ టెస్ట్ పెడుతారు. దీనిలో అర్హత సాధించిన వారికే కోచింగ్ ఇస్తారు.
ప్రతి నెలా రూ.5 వేల స్టైఫండ్..
అభ్యర్థికి ప్రతి నెలా రూ.5 వేలు స్టైఫండ్ కింద అందిస్తారు. బుక్స్ కొనుగోలు చేసుకునేందుకు ఒకేసారి అదనంగా రూ.5 వేలు అందిస్తారు. ఈ స్టడీ సర్కిల్‌లో అత్యంత అనుభవం ఉన్న ఫ్యాకల్టీతో సబ్జెక్టుల వారీగా కోచింగ్ ఇవ్వనున్నారు. ప్రతి వారం మాక్ టెస్టులతో పాటు వాటిని మూల్యాంకనం చేసి అభ్యర్థికి ఎప్పటికప్పుడు ఫీడ్ బ్యాక్ ఇస్తారు.
వీరు మాత్రమే అర్హులు..
యూపీఎస్సీ జారీ చేసిన నోటిఫికేషన్ అర్హతలు పూర్తిగా కలిగి ఉండాలి. కచ్చితంగా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. తల్లిదండ్రుల ఆదాయం గ్రామీణ ప్రాంతాల వారైతే ఏడాదికి రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల వారైతే రూ.2 లక్షల ఆదాయం మాత్రమే ఉండాలి. అభ్యర్థులు ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఉండొద్దు. అలాగే, ఇతర కోర్సులు కూడా చదువుతూ ఉండొద్దు. పూర్తిగా సివిల్స్ పరీక్షల కోసమే ప్రిపేర్ అవుతుండాలి. ఇంతకుముందు, ప్రభుత్వం నిర్వహించిన కోచింగ్ కూడా తీసుకుని ఉండొద్దు.
ఇవే ముఖ్యమైన తేదీలు..
సివిల్స్ కోచింగ్ కోసం రేపు (జులై 15) నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నారు. జులై 17వ తేదీ నుంచి ఆగస్ట్ 7వ తేదీ వరకు తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ వెబ్ సైట్ ద్వారా ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరిస్తారు. ఆగస్ట్ 13 నుంచి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆగస్ట్ 16న స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించి, 19న ఫలితాలను ప్రకటిస్తారు.
ఆగస్ట్ 21న సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేసి, 24వ తేదీ నుంచి హైదరాబాద్ సైదాబాద్‌లోని లక్ష్మినగర్ కాలనీలో ఉన్న బీసీ స్టడీ సర్కిల్‌లో సివిల్స్ కోచింగ్ ప్రారంభిస్తారు. పూర్తి వివరాల కోసం 040-24071178, (phone hidden) నెంబర్లను సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు.
కలం, వెబ్ డెస్క్: యూపీఎస్సీ సివిల్స్ (Civils Coaching) పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న తెలంగాణ బీసీ అభ్యర్థులకు భారీ శుభవార్త. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా కోచింగ్ ఇవ్వబోతున్నట్లు బీసీ ఉపాధి, శిక్షణాభివృద్ధి కేంద్రం ప్రకటించింది. 2027లో జరిగే సివిల్స్ ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలకు కలిపి ఆగస్టు 24వ తేదీ నుంచి 2027 మే వరకు కోచింగ్ ఇవ్వబోతున్నారు.
మరిన్ని కనుగొనండి
ఆన్‌లైన్ వార్తలు
Geographic Reference
వార్తాపత్రిక చందా
150 మందికే అవకాశం..
150 మందికి మాత్రమే కోచింగ్ అవకాశం కల్పిస్తారు. వీరిలో 50 మందిని ఇప్పటికే ప్రిలిమ్స్ క్లియర్ చేసి మెయిన్స్ కోసం సన్నద్ధమయ్యేవారిని తీసుకుంటారు. వీరికి ఎలాంటి స్క్రీనింగ్ టెస్ట్ ఉండదు. ప్రిలిమ్స్ క్వాలిఫై కార్డుతో సంప్రదిస్తే చాలు.. నేరుగా ప్రవేశం పొందవచ్చు. మిగిలిన వంద సీట్ల కోసం స్క్రీనింగ్ టెస్ట్ పెడుతారు. దీనిలో అర్హత సాధించిన వారికే కోచింగ్ ఇస్తారు.
ప్రతి నెలా రూ.5 వేల స్టైఫండ్..
అభ్యర్థికి ప్రతి నెలా రూ.5 వేలు స్టైఫండ్ కింద అందిస్తారు. బుక్స్ కొనుగోలు చేసుకునేందుకు ఒకేసారి అదనంగా రూ.5 వేలు అందిస్తారు. ఈ స్టడీ సర్కిల్‌లో అత్యంత అనుభవం ఉన్న ఫ్యాకల్టీతో సబ్జెక్టుల వారీగా కోచింగ్ ఇవ్వనున్నారు. ప్రతి వారం మాక్ టెస్టులతో పాటు వాటిని మూల్యాంకనం చేసి అభ్యర్థికి ఎప్పటికప్పుడు ఫీడ్ బ్యాక్ ఇస్తారు.
వీరు మాత్రమే అర్హులు..
యూపీఎస్సీ జారీ చేసిన నోటిఫికేషన్ అర్హతలు పూర్తిగా కలిగి ఉండాలి. కచ్చితంగా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. తల్లిదండ్రుల ఆదాయం గ్రామీణ ప్రాంతాల వారైతే ఏడాదికి రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల వారైతే రూ.2 లక్షల ఆదాయం మాత్రమే ఉండాలి. అభ్యర్థులు ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఉండొద్దు. అలాగే, ఇతర కోర్సులు కూడా చదువుతూ ఉండొద్దు. పూర్తిగా సివిల్స్ పరీక్షల కోసమే ప్రిపేర్ అవుతుండాలి. ఇంతకుముందు, ప్రభుత్వం నిర్వహించిన కోచింగ్ కూడా తీసుకుని ఉండొద్దు.
ఇవే ముఖ్యమైన తేదీలు..
సివిల్స్ కోచింగ్ కోసం రేపు (జులై 15) నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నారు. జులై 17వ తేదీ నుంచి ఆగస్ట్ 7వ తేదీ వరకు తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ వెబ్ సైట్ ద్వారా ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరిస్తారు. ఆగస్ట్ 13 నుంచి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆగస్ట్ 16న స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించి, 19న ఫలితాలను ప్రకటిస్తారు. ఆగస్ట్ 21న సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేసి, 24వ తేదీ నుంచి హైదరాబాద్ సైదాబాద్‌లోని లక్ష్మినగర్ కాలనీలో ఉన్న బీసీ స్టడీ సర్కిల్‌లో సివిల్స్ కోచింగ్ ప్రారంభిస్తారు. పూర్తి వివరాల కోసం 040-24071178, (phone hidden) నెంబర్లను సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు.
- Tags
- BC Study Circle
- Civils Coaching
- Telangana Aspirants
- UPSC
Previous article దస్తురాబాద్, పెంబి KGBVలను తనిఖీ చేసిన కలెక్టర్ భవేశ్ మిశ్రా
Next article
కలెక్టర్‌కు చెప్పినా మా ఇష్టమే..! విద్యార్థులపై ఆర్టీసీ డ్రైవర్ రుబాబ్
📌 ఒక్క రూపాయి ఖర్చు లేకుండా సివిల్స్ కోచింగ్! (Lakhtar)
🏢 Kalam Daily
📍 Lakhtar